Share News

ఎచ్చెర్లను అభివృద్ధిలో నెంబర్‌-1 చేస్తా

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:14 AM

: రాష్ట్రంలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెంబర్‌-1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

ఎచ్చెర్లను అభివృద్ధిలో నెంబర్‌-1 చేస్తా
నారాయణపురం కుడి కాలువకు జలహారతి ఇస్తున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తదితరులు

ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెంబర్‌-1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నవభా రత్‌ జంక్షన్‌ వద్ద నారాయణపురం కుడి కాలువకు శుక్రవారం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో నారాయణపురం కాలువ పూర్తిగా నిర్ల క్ష్యానికి గురైందన్నారు. ఇటీవల బుడగట్లపాలేనికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి కాలువ దుస్థితిని వివరించా మని, దీంతో ఆయన స్పందించి రూ.3 కోట్లు విడుదల చేశా రన్నారు. ఈ నిధులతో కాలు పొడవునా పూడికలు తొలగించి అభివృద్ధి చేశామన్నారు. ఈ కాలువ ద్వారా ఎచ్చెర్ల మండలం లో సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, డీసీఎంఎస్‌ చైౖర్మన్‌ చౌదరి అవినాష్‌, నారాయణపురం ప్రాజెక్ట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వర రావు, కూటమి నేతలు విష్వక్సేన్‌, బెండు మల్లేశ్వరరావు, సంపతిరావు నాగేశ్వరరావు, పైడి అన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:14 AM