మానవ హక్కులతోనే సమాన జీవనం
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:58 PM
సమాజంలో అందరూ సమానంగా జీవించేందుకు మానవహక్కులే కీలకం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం లీగల్ డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అందరూ సమానంగా జీవించేందుకు మానవహక్కులే కీలకం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక మెప్మా కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ లభించాల్సిన హక్కుల ను వివరిస్తూ సమాజంపై వారి బాధ్యతలు మరువరాదన్నారు. అనంతరం మానవ హక్కులు కాపాడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ ఎస్.వెంకట రావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాఽథం నాయుడు, చింతాడ కృష్ణమోహన్, మణిశర్మ, గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.