ఎచ్చెర్లలో ఉత్సాహంగా ఐక్యతా ర్యాలీ
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:37 AM
ఎచ్చెర్లలో ఐక్యతా ర్యాలీని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఎచ్చెర్ల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలో ఐక్యతా ర్యాలీని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్, కూటమి నేతలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు చిలకపాలెం నుంచి ఎచ్చెర్ల మీదుగా కేశవరెడ్డి స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేశవరెడ్డి స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం అంతా ఐక్యంగా మందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అఽఽధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.