యువతను చైతన్య పరుస్తూ..
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:04 AM
హర్యానా రాష్ట్రం పానిపట్‌కు చెందిన దీపక్‌శర్మ అనే యువకుడు ఆపరేషన్ సిందూర్ - సంకల్ప వికిసిత్ భారత్ చార్‌ధామ్ పేరిటి సైకిల్ యాత్ర చేస్తూ బుధవారం జాతీయ రహదారి మీదుగా నరసన్నపేట చేరుకున్నారు.
హర్యానా రాష్ట్ర యువకుడి సైకిల్ యాత్ర
నరసన్నపేట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): హర్యానా రాష్ట్రం పానిపట్‌కు చెందిన దీపక్‌శర్మ అనే యువకుడు ఆపరేషన్ సిందూర్ - సంకల్ప వికిసిత్ భారత్ చార్‌ధామ్ పేరిటి సైకిల్ యాత్ర చేస్తూ బుధవారం జాతీయ రహదారి మీదుగా నరసన్నపేట చేరుకున్నారు. సేవా భావం, ఐక్యతా, దేశభక్తి, పర్యావరణం, ఆరోగ్యం తదితర అంశాలపై యువతను అవగాహన కల్పిస్తూ సైకిల్‌పై చార్‌ధామ్ యాత్రను చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మే 25న ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు 7,500 కిలో మీటర్లు పూర్తయింద న్నారు. గుజరాత్, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన దేవాలయాల సందర్శనతోపాటు మార్గమధ్యలో విద్యార్థులు, యువతను కలిసి మాటా ్లడుతున్నట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథస్వామిని దర్శించుకుని బద్రీనాథ్ చేరుకోనున్నట్టు దీపక్‌శర్మ తెలిపారు.