సమస్యలపై ఇంజనీరింగ్ కార్మికుల బైక్ ర్యాలీ
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:56 PM
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు.
శ్రీకాకుళం అర్బన్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. ఏడు రోడ్ల జంక్షన్ నుంచి హయాతీనగరం, డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్డు, జీటీ రోడ్డు, రామలక్ష్మణ జంక్షన్ నుంచి ఉమెన్స్ కళాశాల మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం విధులను బహిష్కరించి 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్‌స్పెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, డీపీవో, సెక్యూరిటీ సిబ్బంది, పార్కు వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ కార్మికులు, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్లు తదితరులు పాల్గొన్నారు.