Share News

ఆక్రమణలు తొలగించారు.. పూడిక మరిచారు

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:43 PM

పురపాలక సంఘంలోని ఆరో వార్డు పరిధిలోని కాళింగమన్నయ్యపేటలో గల చొక్కాకుల బందలో ఆక్రమణలు తొలగించినా, చెరువులోని పూడికలను విడిచిపెట్టడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆక్రమణలు తొలగించారు.. పూడిక మరిచారు
చొక్కాకులబందలో పూడిక తొలగించని దృశ్యం

ఆమదాలవలస, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘంలోని ఆరో వార్డు పరిధిలో ని కాళింగమన్నయ్యపేటలో గల చొక్కాకుల బందలో ఆక్రమణలు తొలగించినా, చెరువు లోని పూడికలను విడిచిపెట్టడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఏడాది నైరుతు రుతుపవనాల సమ యంలో వర్షాలు కురిసినా చెరువులో నీరు నిల్వపై ప్రభావం పడుతుందని, ఫలితంగా ఖరీఫ్‌లో సాగుకు అగచాట్లు తప్పవని రైతులు చెబుతున్నారు.
గ్రీవెన్స్‌లో విన్నవించినా..
సర్వే నెంబర్‌ 290లో చొక్కాకుల బంద ఐదెకరాల 60 సెంట్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బందలో చుట్టుపక్కల కురిసే వర్షం ఆధారంగా నీరుచేరుతుంది. కాళింగమన్నయ్య పేటకు ఆనుకుని ఈ చెరువు ఆధారంగా 80 ఎకరాలకు నీరందుతోంది. గతంలో చెరువు ఆక్రమణకు గురి కావడంతో పత్రికల్లో కథనా లు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా అధికారులు 4 నెలల కిందట ఆక్రమణ లు తొలగించిన విషయం విదితమే. కాని పూడికలను తొలగించడం మరిచిపోయా రని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమ ణలు తొలగించే సమయంలో వర్షాలు కురిశా యి. దీంతో ఆ తర్వాత పూడికలు తీస్తామని అధికారులు స్పష్టంచేసినా, నేటికీ తొలగించలే దని రైతులు చెబుతున్నారు. చొక్కాకుల బంద కింద ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేస్తున్నారు. వేసవిలో పూడికలు తొలగించకపోతే ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుకు కష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూడికలు తొలగించి ఆయకట్టు కు నీరందించేలా చర్యలు తీసుకోవాలని పలు మార్లు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో విన్నవించినా సమ స్యకు పరిష్కారం లభించలేదని రైతులు వా పోతున్నారు. అధికారులు పూడికలు తొలగిం చకపోతే తామంతా కొంత మొత్తంలో డబ్బు లను సేకరించి పూడికలు తొలగించుకుంటా మని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
నిధులు మంజూరైతే తొలగిస్తాం..
గతంలో టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం కింద పూడికలు తొలగించేవారమని ఇరిగేషన్‌ జేఈ శివాజీ తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్లగా ఎటువంటి పనులు చేపట్టడం లేదని చెప్పారు. నిధులు మంజూరైతే చెరువులో పూడికలు తొలగింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 21 , 2025 | 11:43 PM