Share News

దివ్యాంగులకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:03 AM

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. దివ్యాంగులకు క్రీడల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారా స్పోర్ట్స్‌ చైతన్య యాత్ర ఆదివారం శ్రీకాకుళం చేరుకుంది.

దివ్యాంగులకు ప్రోత్సాహం
పారా స్పోర్ట్స్‌ చైతన్యయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ :

అరసవల్లి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. దివ్యాంగులకు క్రీడల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారా స్పోర్ట్స్‌ చైతన్య యాత్ర ఆదివారం శ్రీకాకుళం చేరుకుంది.ఈ మేరకు వారంతా శ్రీకాకుళంలో ఎమ్మెల్యేను కలుసుకున్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే చైతన్య యాత్రకు సంబంధిం చిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.జాతీయస్థాయిలో ప్రతిభచాటిన వారిని సత్కరిం చారు.కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, విజయనగరం గౌరవాధ్యక్షుడు కె.దయానంద్‌, డాక్టర్‌ షీతల్‌ మదన్‌, సురేష్‌, పారా స్విమ్మర్‌ రవి కుమార్‌, అంతర్జాతీయ క్రీడాకారిణి శివగంగ పాల్గొన్నారు.

ఫశ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో 2024-25లో పదోతరగతిలో 550 మార్కులు పైబడి సాధించిన, విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను గొండు శంకర్‌ అందజేశారు.కార్యక్రమంలో సంఘ కమిటీ సభ్యులు,ట్రాఫిక్‌ సీఐనాగరాజు, మాజీకౌన్సిలర్‌ పాండ్రంకి శంకర్‌పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:03 AM