seaweed : సముద్రపు నాచుతో ఉపాధి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:17 AM
Women should achieve economic development సోం పేట మండలం మూలపొలం గ్రామానికి చెందిన డ్వాక్రామహిళలు సముద్రపు నాచు, చేపల ఉత్పత్తు లను పెంచి ఉపాధి పొందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడిన మూలపొలం మహిళ
సోంపేట రూరల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సోం పేట మండలం మూలపొలం గ్రామానికి చెందిన డ్వాక్రామహిళలు సముద్రపు నాచు, చేపల ఉత్పత్తు లను పెంచి ఉపాధి పొందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తీరప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శనివారం మూలపొలంలో కలెక్టర్ సప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో మాట్లాడి డ్వాక్రా మహిళల ఆర్థిక ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జై హనుమాన్ స్వయంశక్తి డ్వాక్రా సం ఘానికి చెందిన ఈరోతు ఊర్వశితో కూడా ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తాము సం ఘంలో చేరిన తర్వాత మొత్తం రుణం తీసుకుని జీవ నోపాధికి వినియోగిస్తున్నానని ఊర్వశి సీఎం చంద్ర బాబుకు తెలిపారు. సముద్రపు నాచు, పీతలు, రొయ్య ల పెంపకంపై అధికారులు అవగాహన కల్పించార న్నారు. తమ గ్రామంలో 350 కుటుంబాలు ఉన్నాయని, ప్రస్తుతం 60 కుటుంబాలు సముద్రపు నాచు పెం చడానికి ముందుకువచ్చాయని వివరించారు. ఉపాధిలో భాగంగా అధికారుల సూచనలు మేరకు సముద్రపు నాచు, రొయ్యలు, పీతలు పెంపకం చేపట్టి.. ఆర్థికాభి వృద్ధి సాధిస్తామన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్
తీరప్రాంత మహిళలు సీ వీడ్(సముద్రపు నాచు)తో ఉపాధి అవకాశాలు పొంది.. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో సముద్రపు నాచు సాగు పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వర్చువల్ ద్వారా మూల పొలం మహిళా సంఘాలతో కాకినాడ నుంచి ప్రత్యేకంగా ముఖాముఖి జరిపారు. అనంతరం కలెక్టర్ స్థానిక మహిళలతో మాట్లాడారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సీఐబీఏ, ఎన్‌వోటి సాంకేతిక సహకారంతో, సెర్ఫ్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఈ సాగు చేపట్టేందుకు మహిళలు ముందుకు రావాల న్నారు. సాగు ఉత్పత్తులను ఉదయ్ ఆక్వా కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అంతకుముందు పరిశ్రమ పరిధిలో ఉన్న చెరువులను పరిశీలించారు. అనంతరం పాలవలస లోని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్‌కుమార్, మత్స్యశాఖ ఉపసంచాలకులు సత్యనారాయణ, పలాస ఆర్డీవో వెంకటేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.