Share News

ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: పీడీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:50 PM

ఉపాధిహామి సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని డుమా పీడీ బి.సుధాకరరావు హెచ్చరించారు.

 ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: పీడీ
మాట్లాడుతున్న సుధాకరరావు

జలుమూరు (సారవకోట) సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామి సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని డుమా పీడీ బి.సుధాకరరావు హెచ్చరించారు. బుధవారం సారవకోట మండలపరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉపాధిహామీ సామాజిక తనిఖీలు ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వేతనదారులు సంతకం లేకుండా బిల్లులు ఏ విదంగా చెల్లించారని మండిపడ్డారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో నాలుగు లక్షలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో బయట పడిందన్నారు. దీనికి ఏపీవోతో పాటు ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు బాధ్యతవహించాలన్నారు.జిల్లావిజిలెన్స్‌ అధికారి బి.లవరాజు,ఏపీడీలు లోకేష్‌, పి.రాధ, ఎంపీడీవో మోహనకుమార్‌, నారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:51 PM