ఉద్యోగుల వేతన సవరణ చేయాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:18 AM
పీఏసీఎస్ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కార్యాలయం ఆవరణలో ఏపీ సహ కార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో ధర్నానిర్వహించి,
అరసవల్లి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కార్యాలయం ఆవరణలో ఏపీ సహ కార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో ధర్నానిర్వహించి, సీఈవో దత్తి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.