‘యూనివర్సిటీ’ చిత్రాన్ని ఆదరించండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:46 PM
తన దర్శకత్వంలో వచ్చిన ‘యూని వర్సిటీ.. పేపర్ లీక్’ చిత్రాన్ని ఆదరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీషను ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కోరారు.
పలాసరూరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తన దర్శకత్వంలో వచ్చిన ‘యూని వర్సిటీ.. పేపర్ లీక్’ చిత్రాన్ని ఆదరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీషను ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కోరారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి ఈ చిత్రం ప్రివ్యూకు హాజరుకావాలని ఆహ్వానం పలికారు. ఈ నెల 24న పలాసలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు తెలిపారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ప్రస్తుత సినిమా, రాజకీయ అంశాలపై కాసేపు వారిద్దరూ ముచ్చటించారు. అనంతరం ఆయనతో పలువురు టీడీపీ నాయకులు ఫొటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, టీడీపీ నాయకులు బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.