Share News

వైసీపీ తొలగిస్తే.. కూటమి ప్రభుత్వం అందించింది

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:26 PM

గత వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో నందిగాం మండలం దీనబందుపురం గ్రామానికి చెందిన పలువురు పింఛన్లు తొలగించింది. వారు కోర్టును ఆశ్రయించారు.

వైసీపీ తొలగిస్తే.. కూటమి ప్రభుత్వం అందించింది

కోటబొమ్మాళి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో నందిగాం మండలం దీనబందుపురం గ్రామానికి చెందిన పలువురు పింఛన్లు తొలగించింది. వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అందిస్తుంది. దీంతో పింఛన్‌ నిలుపుదల చేసిన నుంచి తొమ్మిది మందికి రూ.18 లక్షలు బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్‌డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అద్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే కోటబొమ్మాళి మేజరు పంచాయతీ పొందవీధులో నివాసం ఉంటున్న సుమారు 40 పొందర కుటుంబాల వారు తమ ఆధీనంలో ఉన్న భూములు సాగు చేసుకుంటున్నా, ఆ భూములు ఇతరుల పేర్లు మీద ఉండడంతో వారు 50 ఏళ్లుగా ఎక్కని గడపలేదు, కలవని అధికారులు లేరు. చివరికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఆ భూములకు విముక్తి కలిగింది. దీంతో బుధవారం ప్రకాశ్‌నగర్‌ కాలనీలో లబ్ధిదారులకు వారి పేర్లు మీద వన్‌-బీ పత్రాలను అందజేశారు.

Updated Date - Dec 31 , 2025 | 11:26 PM