అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సాయం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:19 AM
అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలం దిమిలి గ్రామానికి చెందిన గేదెల స్వప్నకు రూ.60వేలు, బండారు లక్ష్మికు రూ.50,250 చొప్పున్న చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వీరు తమ ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించడంతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందించాఉ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారు లతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.