Share News

అక్రమ రొయ్యల చెరువులకు విద్యుత్‌ నిలిపివేత

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:55 PM

శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్ద గణగళ్లవానిపేటలో అక్రమంగా నిర్వహిస్తున్న రొయ్యల చెరువులకు విద్యుత్‌ను శనివారం నిలుపుదల చేశారు.

అక్రమ రొయ్యల చెరువులకు విద్యుత్‌ నిలిపివేత
విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తున్న సిబ్బంది

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్ద గణగళ్లవానిపేటలో అక్రమం గా నిర్వహిస్తున్న రొయ్యల చెరువులకు విద్యుత్‌ను శనివారం నిలుపుదల చేశారు. ఈ చెరువుల నుంచి వచ్చే వర్థాలతో గ్రామస్థులు అనారోగ్యం పాలవుతున్నారని శనివారం స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ దృష్టికి స్థానికులు తీసుకు వెళ్లారు. దీంతో వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి తక్షణం విద్యుత్‌ నిలుపుదల చేయాలని వారు ఆదేశించారు. రొయ్యల ట్యాంకులను తొలగించాలని సంబంధిత అధికా రులకు సూచించారు. సమస్యపై తక్షణం స్పందించిన కలెక్టర్‌, ఎమ్మెల్యేలకుస్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

చెరువుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు

గార, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వమర వల్లి పరిధి లోని రొయ్యల చెరువులు, రొయ్యల హేచరీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలను శనివారం నిర్వహించారు. కాకి నాడలోని రాష్ట్ర మత్స్య, సాంకేతిక శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో సాంకేతిక సిబ్బంది శ్యాంపిళ్లను సేకరించారని, వివిధ పరీక్షలు చేసి రైతులకు ఆ ఫలితాలను తెలియ జేస్తారని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు బి.సురేష్‌కుమార్‌ తెలిపారు. కార్యక్ర మంలో మత్స్య సహాయకులు హేమ సుందర్‌, ఆక్వా ల్యాబ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ పి.వెంకటబాబు, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:55 PM