ఎన్డీఏకు తొత్తుగా ఎన్నికల కమిషన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:58 PM
భారత ఎన్ని కల కమిషన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహ రిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు.
-కేంద్ర మాజీ మంత్రి కృపారాణి
టెక్కలి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్ని కల కమిషన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహ రిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. మంగళవారం టెక్కలిలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ఓ రాజకీయ పార్టీ నాయ కుడిలా, బీజేపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతు న్నారని విమర్శించారు. ఓట్ల చోరీపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పవర్‌పాయింట్ ప్రజింటేషన్ ద్వారా వాస్తవాలు వివరిస్తే, దానికి వివరణ ఇవ్వాల్సిన సీఈసీ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల కమి షన్ ఈ విధంగా దిగజారుతుందని దేశ ప్రజలు ఏనాడూ భావించలేదని అన్నారు.