రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:54 PM
కొండతెంబూరు సమీపాన జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వంజంగి సీతమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు.
నందిగాం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కొండతెంబూరు సమీపాన జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వంజంగి సీతమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు.. సీతమ్మ తన అల్లుడ్ని సాగనంపేం దుకు జాతీయరహదారికి వచ్చి, తిరిగి రహదారి దాటుతుండగా శ్రీకాకుళం నుం చి పలాస వైపు వెళ్తున్న పార్సిల్ వ్యాన్ ఢీకొంది. ఈమె రెండుకాళ్లకు గాయాల య్యాయి. గాయపడ్డ సీతమ్మను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. సీతమ్మ కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు
కంచిలిలో వృద్ధుడికి..
కంచిలి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కంచిలి జాతీయ రహదారి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాకరాపల్లి గ్రామానికి చెందిన బడాయి ధర్మారావు అనే వృద్ధుడు గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మారావు తన స్వగ్రామం నుంచి పురుషోత్తపురం వెళ్లేందుకు జాతీయ రహదారిని కాలి నడకన దాటుతుండగా పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న టిప్పర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ధర్మారావు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి బాధితుడిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు బడాయి భగీరథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.
ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి..
శ్రీకాకుళం క్రైం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): అరసవల్లి వద్ద బుధవారం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తి గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరసవల్లి కొయ్యానవీధికి చెందిన పల్లికల బాలకృష్ణారెడ్డి ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళుతుండగా.. అరసవల్లి రోడ్డు నుంచి మిల్లు జంక్షన్ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న సూరాడ తేజేశ్వరరావు ఢీకొన్నాడు. దీంతో బాలకృష్ణరెడ్డికి గాయాలయ్యాయి. బాలకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.