చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:02 AM
ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన ఎస్‌ఎం పురపు నారాయణమ్మ(72) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
ఎచ్చెర్ల, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన ఎస్‌ఎం పురపు నారాయణమ్మ(72) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నారాయ ణమ్మ ఏడాదిగా పక్షవాతంతో బాధపడుతూ ఎస్‌ఎం పురంలోని చిన్న కుమార్తె దుర్గ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 10న ఉదయం 11 గంటల సమయంలో ఆమె స్పృహతప్పి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఆమె పక్కనే చీమల మందు నీటిలో కలిపిన పాత్ర కనిపించింది. ఆ నీటిని తాగి ఉంటుందని భావించి వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఉపాధి రీత్యా అనకాపల్లిలో ఉంటున్న నారాయణమ్మ కుమారుడు లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.