Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:15 AM

శుభకార్యక్రమానికి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణం బలగ ఆదివారంపేటకు చెందిన దమ్ము నూకలమ్మ (62) బుధవారం మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

నరసన్నపేట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): శుభకార్యక్రమానికి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణం బలగ ఆదివారంపేటకు చెందిన దమ్ము నూకలమ్మ (62) బుధవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నూకలమ్మ తన కుమారుడు సుధాకర్‌తో కలిసి దిచక్రవాహనంతో కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో జరిగిన ఒక శుభ కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు పయ ణంలో తామరాపల్లి శివారులో పశ్చిమబెంగాల్‌ నుంచి స్పోర్ట్స్‌ బైక్‌పై వస్తున్న వ్యక్తి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక భాగాన కూర్చొన్న నూకలమ్మకి బలమైన గాయాలు కాగా.. సుధాకర్‌కి స్వల్ప గాయాల య్యాయి. స్థానికుల సాయంతో 108వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప త్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. సుధాకర్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ అసిరినాయుడు తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు..

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందినట్టు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన సంతకవిటి మండలం జీఎన్‌ పురానికి చెందిన గురు గుబిల్లి పృథ్వీరాజ్‌ (25) నగరంలోని ఓ బంగారం దుకాణంలో పనిచేస్తూ డైమం డ్‌ పార్క్‌ వద్ద తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 4న కడుపునొప్పి తట్టుకోలేక పాయిజిన్‌ తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సహచరులు గమనించి చికిత్స నిమిత్తం 108లో రిమ్స్‌కు తరలించారు. అనంతరం అతని మేనమామకు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:15 AM