ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:15 AM
దంత గ్రా మానికి చెందిన సాకిపల్లి సుందరమ్మ(62) ఆదివారం ఉ దయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందింది.
కోటబొమ్మాళి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): దంత గ్రా మానికి చెందిన సాకిపల్లి సుందరమ్మ(62) ఆదివారం ఉ దయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందింది. పోలీ సులు తెలిసిన వివరాల మేరకు.. సుందరమ్మ తన పెద్ద కుమార్తె నీలవేణి, అల్లుడు చంటి, అడపడుచు లక్ష్మిలను బస్సు ఎక్కించేందుకు దంత గ్రామంలో గల కొత్తమ్మతల్లి గుడి వద్దకు వచ్చింది. ఇక్కడి నుంచి విశాఖ వెళ్తున్న ఆ ర్టీసీ బస్సును డ్రైవర్ టర్నింగ్ చేస్తుండగా.. బస్సు వెనుక నిల్చున్న సుందరమ్మ దీనిని గమనించలేదు. దీంతో బ స్సుకి రాయికి మధ్యలో ఉండిపోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమె ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా.. అప్పటికే సుందరమ్మ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సుందరమ్మ భర్త సూర్యనారాయణ ఐదేళ్లు కిందటే మృతి చెందగా, వీరికి వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. సుందరమ్మ చిన్న కుమార్తె రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి..
కవిటి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కొజ్జిరియా జంక్షన్ వద్ద ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి కార్తీక్‌దాస్(16) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం రత్తకన్న నుంచి ఇటుకలతో జమేదారుపుట్టుగ వెళుతున్న ట్రాక్టర్ కొజ్జిరియా జంక్షన్‌లోని కల్వర్టు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై కూర్చున్న కార్తీక్‌దాస్ కిందపడి తీవ్రంగా గాయప డ్డారు. వెంటనే క్షతగాత్రుడిని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్తీక్‌దాస్ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హింజిల్‌ఘాట్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
యువకుడి మృతదేహం గుర్తింపు
ఎచ్చెర్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలి సమీపంలోని వంతెన పైనుంచి నాగావళి నదిలో దూకిన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఎస్‌ఐ సందీప్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుజరాతీపేట శివాలయంవీధికి చెందిన సాయినేతాజీ (17)ని తండ్రి ఉమారుద్ర కోటేశ్వరరావు మందలించడంతో మనస్తాపం చెంది ఈనెల 7న రాత్రి నాగావళి నదిలో దూకాడు. ఈ క్రమంలో మండలంలోని బొంతలకోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం వద్ద సముద్ర తీరంలో సాయినేతాజీ మృతదేహాన్ని ఆ గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారమి చ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా సాయినేతాజీగా గుర్తించారు. దీనిపై ఇప్పటికే శ్రీకాకుళం టూటౌన్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, యువకుడి తండ్రి నుంచి వివరాలు సేకరించినట్టు తెలిపారు.