ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి గాయాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:00 AM
స్థానిక ఆలాంధ్రరోడ్ కూడలికి చేరువలో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పెద్దదేవాంగులవీధికు చెందిన వృద్ధుడు కొసమాన మోహనరావు అనే వృద్దుడు గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
పాతపట్నం, జూలై 12(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆలాంధ్రరోడ్ కూడలికి చేరువలో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పెద్దదేవాంగులవీధికు చెందిన వృద్ధుడు కొసమాన మోహనరావు అనే వృద్దుడు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెలితే శనివారం ఇంటి రెంయి సత్యసాయి మందిరానికి వెళుతున్న మోహనరావును పాతపట్నం నుంచి పర్లాకిమిడి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన మోహనరావుకు స్థానిక సీహెచ్‌సీలో వైద్యసేవలందించి మెరుగైన వైద్యం కోసం టెక్కలిలో గల జిల్లా ఆసుపత్రికు తరలించారు. అక్కడ కూడా వైద్య సేవలు పొంది వైద్యుల సిఫార్స్ మేరకు శ్రీకాకుళం తరలించారు. మోహనరావు కుమారుడు మల్లేశ్వరరావు ఇచ్చిన ిఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ జి.సింహాచలం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.