Share News

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:04 AM

చీడివలస గ్రా మానికి చెందిన మజ్జి రామస్వామి (75) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

 చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

బూర్జ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): చీడివలస గ్రా మానికి చెందిన మజ్జి రామస్వామి (75) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉ న్నాయి.. రామస్వామి భార్య ఏడాది కిందట మృతి చెందింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. తరచూ చనిపోవాలని ఉందంటూ కుటుంబ సభ్యుల వద్ద చెబుతుండేవాడు. దీనికి తోడు మతిస్థిమితం కో ల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేప థ్యంలో సోమవారం ఇంటిలో ఎవరూలేని సమయం లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విష యాన్ని గుర్తించిన కుమారుడు రమణ వైద్యసేవల నిమిత్తం 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రామస్వామి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రవల్లిక తెలిపారు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

శ్రీకాకుళం క్రైం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నగరంలోని కృష్ణాపార్కు సమీపంలోని మహిళా మండలివీధి వద్ద నాగావళి నదిలోకి ఆదివారం తన స్నేహితులతో స్నానానికి వెళ్లి గల్లంతైన వమ్మి ఉదయ్‌(20) మృతదేహం మంగళవారం లభ్యమైంది. గత రెండు రోజులుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాగావళి నదీ తీరమంతా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం తండ్రి, బంధువులు ఉదయ్‌ ఆచూకీ కోసం నాగావళి నదీతీరంలోని వెతకగా కలెక్టర్‌ బంగ్లా సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నదీతీరంలో మృతదేహం ఉదయ్‌ తండ్రి లక్ష్మీనారాయణకు కనిపించింది. ఈ మేరకు అతను వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ హరికృష్ణ ఘటనా స్థలాన్ని చేరుకొని ఉదయ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Nov 12 , 2025 | 12:04 AM