Share News

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:55 PM

కుశాలపురం బైపాస్‌ రోడ్డుకు సమీపంలో ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ (65) శనివారం రాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ఎచ్చెర్ల, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కుశాలపురం బైపాస్‌ రోడ్డుకు సమీపంలో ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ (65) శనివారం రాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సేకరిస్తూండే లక్ష్మణ్‌ ఆ రోజు రాత్రి రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు వెళుతున్న బైక్‌ ఢీకొంది. గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం తొలుత శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి, ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..

ఇచ్ఛాపురం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): బెల్లుపడ జాతీయ రహదారి పాత టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం టోల్‌ప్లాజా వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టడంతో బిచ్చగాడు మృతిచెందినట్టు స్థానికుల దారాఆ తెలుస్తుందని పట్టణ ఎస్‌ఐ వి.ముకుందరావు తెలిపారు. బెల్లుపడ వీఆర్‌ఓ చాముం డేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:55 PM