Share News

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:07 AM

పొన్నాడ గ్రామానికి చెందిన నేతింటి రాములు(65) శనివారం రాత్రి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందినట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ఎచ్చెర్ల, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పొన్నాడ గ్రామానికి చెందిన నేతింటి రాములు(65) శనివారం రాత్రి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందినట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నా యి.. రాములుకు రెండేళ్ల కిందట ఎడమ కాలు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన ఓ ఆవును కొనుగోలు చేసి పాలు విక్రయిస్తూ వచ్చి న సొమ్ముతో మందులను కొనుగోలు చేసుకునేవాడు. అయితే ఇటీవల ఆవు సరి గా పాలు ఇవ్వకపోవడం, మందుల కొనుగోలుకు ఎవరికీ డబ్బులు అడిగేందుకు ఇష్టపడక మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం కళ్లంలో గడ్డి మందును తాగేశాడు. దీనిని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలి యజేయడంతో శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. ఆదివారం శవపంచనామా అనంత రం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతు డికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి..

ఎచ్చెర్ల, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): బుడగట్లపాలెం గ్రామ సమీపంలో రొయ్యల చెరువులో పనిచేస్తున్న గార మండలం తోణంగి పంచాయతీ బచ్చువానిపేటకి చెందిన బచ్చు రామారావు(44) శనివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందా డు. ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నాలుగేళ్లుగా రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్న రామారావు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో చెరువులో నీరు నింపేందుకు మోటారు స్విచ్‌ ఆన్‌ చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీనిని గమనించిన తోటి వర్కర్లు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్యమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య వర లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్మీ ఉద్యోగి..

పలాస రూరల్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పలాస మండలం చిననీలావతి గ్రామానికి చెందిన మిలటరీ ఉద్యోగి సొర్ర సంతోష్‌కుమార్‌(32) శనివారం రాత్రి మృతి చెందాడు. సంతోష్‌కుమార్‌ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆర్మీగా ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడురోజుల కిందట సెలవుపై స్వగ్రామానికి వచ్చి న అతడు శనివారం రాత్రి మృతి చెందగా, కారణాలు తెలియరాలేదు. సంతోష్‌ తండ్రి జానకీరావు కరోనా సమయంలో చనిపోయారు. తల్లి హేమలత గ్రామం లోనే నివసిస్తుండగా భార్య జయశ్రీ, కుమారుడు అండమాన్‌లో ప్రస్తుతం ఉన్నా రు. అదే రోజు రాత్రే అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామంలో చర్చనీయాం శంగా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - Aug 11 , 2025 | 12:07 AM