అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:48 PM
మండలంలోని చాపర గ్రామా నికి చెందిన క్కిక్కర అప్పలస్వామి(89) శుక్రవారం సాయంత్రం మర్రి పాడు-సి గ్రామానికి సమీపంలోని ఉల్లాస పేటకి చెందిన తోటలో అను మానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించినట్లు పాత పట్నం ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు.

మెళియాపుట్టి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాపర గ్రామా నికి చెందిన క్కిక్కర అప్పలస్వామి(89) శుక్రవారం సాయంత్రం మర్రి పాడు-సి గ్రామానికి సమీపంలోని ఉల్లాస పేటకి చెందిన తోటలో అను మానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించినట్లు పాత పట్నం ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వృద్ధుడి భార్య ఇటీవల మృతి చెందగా పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని గ్రామస్థులు తెలిపారు. అయితే గడచిన 3 రోజులుగా వృద్ధుడు కనిపించకపోవడంతో కుమారులకు సమాచారం ఇవ్వ డంతో పెద్ద కోడలు చిన్నా గురువారం గ్రామానికి వచ్చి మావగారి కోసం గాలించారు. అయితే శుక్రవారం మర్రిపాడు గ్రామస్థులు పొలం పనులకు వెళ్లి చూడడం తో తోటలో వృద్ధుడి మృతదేహం గమనించి పోలీసు లకు సమాచారం అం దించారు. పోలీసులు వెళ్లి చూసి మృతి చెందిన వ్యక్తి చాపర గ్రామస్థుడని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయి తే ఏం జరిగిందో తెలియదుగాని వృద్ధుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సారా తాగేందుకు వెళ్లి మృతి చెందాడా లేక మరే ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తు న్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
9 మందిపై బైండోవర్ కేసులు
మెళియాపుట్టి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తొమ్మిది మంది బెల్లం వ్యాపారుల పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు టెక్కలి ఎక్సైజ్ సీఐ ఎస్‌కే మీరాసాహిబ్ తెలిపారు. ఈ మేరకు వీరిని శుక్రవారం తహసీ ల్దార్ బి.పాపారావు ఎదుట హాజరుపరిచామన్నారు. ప్రతి వారం బెల్లం అమ్మ కాల వివరాలు తెలియజేయాలన్నారు. తరచూ బెల్లం కొనుగోలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. సారా తయారీకి బెల్లం అమ్మితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
మద్యంతో ఒకరి అరెస్టు
జి.సిగడాం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సిరుగుడు గోవిందరావు 128 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తూ పట్టుబడినట్టు తెలిపారు. ఎస్పీఆర్ పురం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా మోపెడ్‌పై వెళ్తున్న గోవిందరావు వాహనాన్ని తనిఖీ చేసి 116 క్వార్టర్ సీసాలు, 12 బీరు సీసాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్టు చెప్పారు. గోవిందరావును పొందూరు కోర్టుకు తరలించగా రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఫొటో: క్రైం