రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:36 PM
శ్రీకాకుళం రూరల్ మండల పరిధి పెద్దపాడు ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు.
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ మండల పరిధి పెద్దపాడు ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దపాడుకు చెందిన బొట్ట సూర్యనారాయణ (65) స్థానిక పద్మావతి కల్యాణ మండపంలో నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులకు వెళు తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా శ్రీకాకుళం నుంచి పెద్దపాడు వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడి భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ కె.రాము తెలిపారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో వారంతా లబోదిబోమంటున్నారు.
చికిత్స పొందుతూ మరో వృద్ధుడు..
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పెద్దపాడు వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 60 ఏళ్ల వ్యక్తి మంగళవారం మృతిచెందా డని రూరల్ ఎస్‌ఐ బి.రాము తెలిపారు. ఈనెల 17న పెద్దపాడులో అపస్మారక స్థితిలో ఉన్న సదరు బిచ్చగాడిని స్థాని కులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డని, ఇతని వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీలో చోరీ
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీలో సోమవారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రణస్థలంలో ఐసీఐసీ ఐ బ్యాంకులో సేల్స్ అధికారిగా పనిచేస్తున్న అరసవిల్లి ఝాన్సీ భర్త కానిస్టేబుల్ రవితో కలిసి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తు న్నారు. ఆమె ఈనెల 27న రాత్రి ఇంటికి తాళం వేసి కన్నవారి గ్రామం ముగతంపాలెం వెళ్లి తిరిగి సోమవారం రాత్రి ఇంటికి చేరుకునే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసి చోరీ జరిగిందని గుర్తించారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరిం చారు. 2 తులాల బంగారం, జత పట్టీలు చోరీకి గురైనట్లు పోలీ సులు గుర్తించారు. క్లూస్ టీం పరిశీలించింది. ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.