Share News

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:09 AM

పలాస మండలం టెక్కలిపట్నం స మీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన(75) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

పలాస రూరల్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పలాస మండలం టెక్కలిపట్నం స మీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన(75) మృతి చెందాడు. కాశీ బుగ్గ పోలీసుల కథనం మేరకు.. దుర్యోధన కూరగాయలు కొనుగోలు చేసేందుకు టెక్కలిపట్నం వచ్చి తిరిగి వెళ్తుండగా.. వేగంగా ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని హుటాహుటిన స్థానికులు ప లాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 01:09 AM