Share News

ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:27 AM

కనిమెట్ట గ్రామానికి చెందిన పేడాడ అప్పలనాయుడు (60) ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

పొందూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కనిమెట్ట గ్రామానికి చెందిన పేడాడ అప్పలనాయుడు (60) ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మద్యానికి అలవాటు పడిన అప్పలనాయుడును కుటుంబసభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకున్నాడు. హైదరాబాద్‌లో తాపీ పనిచేస్తున్న అప్పలనాయుడు ఇటీవల రైతు భరోసా నగదును తీసుకునేందుకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. భార్య అప్పలనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 12:27 AM