బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడి అరెస్టు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:07 AM
పట్టణంలో ఓ కాలనీలో గత ఆదివారం ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన డబ్బై ఏళ్ల వృద్ధుడు చల్ల రామమూర్తిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
నరసన్నపేట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి) పట్టణంలో ఓ కాలనీలో గత ఆదివారం ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన డబ్బై ఏళ్ల వృద్ధుడు చల్ల రామమూర్తిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. వృద్ధుడినిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నరసన్నపేట కోర్టు న్యాయాధికారి రిమాండ్ విధించినట్టు తెలిపారు.