Share News

jetty in Rajarampuram రాజారాంపురంలో జెట్టీ ఏర్పాటుకు కృషి: బగ్గు

ABN , Publish Date - May 01 , 2025 | 12:00 AM

jetty in Rajarampuram సాగరతీర గ్రామం రాజారాంపురంలో మత్స్యకారుల సౌకర్యం కోసం జెట్టీని ఏర్పాటు చేసేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

jetty in Rajarampuram రాజారాంపురంలో జెట్టీ ఏర్పాటుకు కృషి: బగ్గు
చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సాగరతీర గ్రామం రాజారాంపురంలో మత్స్యకారుల సౌకర్యం కోసం జెట్టీని ఏర్పాటు చేసేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం సాయంత్రం మత్స్యకారుల వేటనిషేధ భృతి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మత్స్యకార గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభు త్వమేనని గుర్తు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మత్స్యకార గ్రామాలను నిర్లక్ష్యం చేశార న్నారు. వేట నిషేధ భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులను ఆదుకున్నారన్నా రు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానికుల నుంచి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మిరియబ్బిల్లి వెంకల అప్పలనాయుడు, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, టీడీపీ నేతలు బైరి భాస్కరరావు, మైలపల్లి త్రినాథరావు, కోడ తాతారావు, లక్ష్మీపతి, సూరపు నారాయణదాస్‌, సర్పంచ్‌ ప్రతినిధి యాపర ధర్మారావు, ఎంపీటీసీ మూర్తి, తహసీల్దార్‌ ఎం.సురేష్‌కుమార్‌, ఎంపీడీవో రవికుమార్‌, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:00 AM