ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:53 PM
ఫొటోగ్రాఫర్లు ఎదు ర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కా రానికి కృషి చేస్తామని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు మెట్ట నాగరాజు అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఫొటోగ్రాఫర్లు ఎదు ర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కా రానికి కృషి చేస్తామని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు మెట్ట నాగరాజు అన్నారు. ప్రపంచ 186వ ఫోటో గ్రఫీ డేని మంగళవారం ఓ స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితా మహుడు లూయిస్ డాగురే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వేణు, సంఘ ప్రతినిధులు శ్రీను, వెంకటేష్, రవి, యుగంధర్, చిరంజీవి పాల్గొన్నారు.
సీనియర్ ఫొటోగ్రాఫర్లకు సత్కారం
ఎచ్చెర్ల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం ఎచ్చెర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి ఫొటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెట్ట నాగరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు. సీని యర్ ఫొటోగ్రాఫర్లు ఎస్.చిరంజీవి, టి.భానుమూర్తి, ఎం.గోపాల్, జి.కుమార్, పి.సూరిబాబులను సత్కరించారు. కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు ఐవీ రమణ, కొండలరావు, బాల రాజు, సురేష్‌బాబు, హేమ సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
కంచిలిలో రక్తదానం
కంచిలి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఉద్దానం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆఽధ్వర్యంలో కంచిలి మార్కెట్ యార్డు వద్ద మంగళవారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది రక్తదానం చేశారు. రక్తదాతలను తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, సోం పేట సీఐ బి.మంగరాజు, ఇన్‌చార్జి ఎంపీడీవో జి.వీరభద్రస్వామి అభినందిం చారు. అనంతరం మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పొట్నూరు రాజశేఖర్, నరసింహ, శ్యామ్‌బాబు, జగదీష్, కృష్ణ, నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.