Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: శిరీష

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:57 PM

నియోజక వర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారంపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: శిరీష
వినతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారంపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శుక్రవారం తన ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించా రు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.14.68 కోట్లు మంజూరు చేశామని, మందస మండలంలో రూ.8కోట్లతో తారు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. మే మొదటి వారంలో పట్టణానికి తాగునీరు సరఫరా చేసేం దుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన మువ్వల నగేష్‌ మృతి చెందాడని, న్యాయం చేయాలని అతని తల్లి మువ్వల సుందరి కోరారు. మత్స్యకారుల జీవనభృతిలో అవకతవకలు జరిగాయని వాటిని సరిచేయాలని గుణుపల్లికి చెందిన మత్స్యకారులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరికట్ల విఠల్‌ రావు, నాయ కులు లొడగల కామేశ్వ రరావు, గురిటి సూర్య నారాయణ, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, కొండే నర్సింహులు పాల్గొన్నారు.

వారధులుగా నిలవాలి: ఎంజీఆర్‌

పాతపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి వారధులుగా నిలవాలని టీడీపీ క్యాడర్‌ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకోసం పనిచేసే వ్యక్తులను అధిష్ఠానం గుర్తించి తగు సమయంలో సముచిత స్థానం ఇస్తుందన్నారు. అలాగే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

Updated Date - Apr 25 , 2025 | 11:58 PM