Share News

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:43 PM

నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని 31, 32, 34 వార్డులలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం నిర్వ హించారు.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే శంకర్‌
అరసవల్లి: కరపత్రం ఇచ్చి వివరిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, జూలై 22(ఆంధ్రజ్యోతి): నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని 31, 32, 34 వార్డులలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం నిర్వ హించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు ఇచ్చి సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, వార్డు ఇన్‌చార్జిలు విభూది సూరిబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం

సోంపేట రూరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షే మానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. మాకన్నపురంలో మంగళవారం ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకా లు, చేసిన అభివృద్ధిని కరపత్రాలను పంపిణీ చేసి వివరిం చారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి రాజు, మడ్డు కుమార్‌, సర్పంచ్‌ మద్దిల నాగేశ్వరరావు, సూరాడ చంద్రమోహన్‌, చిత్రాడ శేఖర్‌, మడ్డు రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:43 PM