Share News

అర్జీల పరిష్కారానికి కృషి: ఎస్పీ మహేశ్వరరెడ్డి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:03 AM

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించా రు.

 అర్జీల పరిష్కారానికి కృషి: ఎస్పీ మహేశ్వరరెడ్డి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 36 సమ స్యలను పరిష్కరించాలని బాధి తులు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. తక్షణం వినతులను విచారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.

అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోండి

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను ప్రేరేపిస్తూ యువతను, స్థానికులను తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని మూలసవలాపురం గ్రామ స్థులు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. దందాలు, రౌడీయిజం, సారా, మద్యం, గంజాయి, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు జిల్లా నలుమూలల చేస్తున్న రౌడీషీటర్‌ కొర్లయ్య, అతని కుటుంబ సభ్యులు గొల్లపల్లి ఎర్ర య్య, సారిపల్లి శ్రీనివాసరావులపై సరుబుజ్జిలి పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులున్నాయని, వీరు గంజాయి, మద్యం వంటి వాటిని యువతకు, గ్రామస్థులకు అందించి వారిని చెడు మార్గంలో నడిపిస్తూ గ్రామ పరువు ప్రతిష్టలకు భంగం కలిగ్తిస్తున్నారని, తగు చర్యలు తీసుకో వాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:03 AM