Share News

పర్యావరణ పరిరక్షణకు కృషి అభినందనీయం

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:44 PM

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షించాలని, ప్లాస్టిక్‌ను విడనాడాలని కోరుతూ చేపట్టిన గ్రేట్‌ ఆంధ్రా రైడ్‌ యువకులు ప్రచారం చేస్తుండడం అభినం దనీయమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి అభినందనీయం
బైక్‌ రైడర్లను అభినందిస్తున్న ఎమ్మెల్యే బి.అశోక్‌

కవిటి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షించాలని, ప్లాస్టిక్‌ను విడనాడాలని కోరుతూ చేపట్టిన గ్రేట్‌ ఆంధ్రా రైడ్‌ యువకులు ప్రచారం చేస్తుండడం అభినం దనీయమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన శివకుమార్‌, ఉపేంద్ర, లక్ష్మీపతి బైక్‌లపై కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన ప్రచారంలో భాగంగా వీరు మంగళవారం కవిటి మండలం రామయ్యపుట్టుగ వచ్చి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ ను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వా నించి సత్కరించారు. మంచి కార్యక్రమం చేపడుతున్నారని కొనియాడారు. బైక్‌రైడర్లు తిరుగు ప్రయాణానికి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పి.కృష్ణారావు, బి.రమేష్‌, ఎస్వీరమణ, బాసుదేవ్‌ప్రదాన్‌, ఎస్‌.సహాదేవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:44 PM