Share News

గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:03 AM

గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, మాజీ మంత్రి గౌతు శివాజీ తెలిపారు. మంగళవారం పట్టణంలో అభ్యుద య సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

 గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
సోంపేట: సైకిల్‌ర్యాలీలో పాల్గొన్న విప్‌ అశోక్‌ :

సోంపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, మాజీ మంత్రి గౌతు శివాజీ తెలిపారు. మంగళవారం పట్టణంలో అభ్యుద య సైకిల్‌యాత్ర నిర్వహించా రు. ఈసందర్భంగా మాట్లాడు తూ మత్తుపదార్థాలకు బానిస కావడం వల్ల ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా కూడా కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలి పారు. ర్యాలీలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటుసంస్థల విద్యార్థులు, వివిధ వర్గాల వ్యాపారులు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, సీఐ మంగరాజు, ఎస్‌ఐ లోవరాజు, పారినాయుడు పాల్గొన్నారు.

ఫ కంచిలి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అభ్యుదయ సైకిల్‌ యాత్ర మంగళవారం మధ్యాహ్నం కంచిలి చేరింది. ఎస్‌ఐ పారినాయుడు, కూటమి నాయకులు, విద్యార్థులు స్వాగతం పలికారు.

Updated Date - Dec 31 , 2025 | 12:04 AM