ఆలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:31 PM
ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పీఎన్ కాలనీ నారాయణ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లు పాలకమండళ్ల నియామకాలు లోపభూయిష్టంగా జరిగాయన్నారు. ఈనేపథ్యంలో ఆలయాల అభివృద్ధికి పాటుపడతా మన్న వారినే సభ్యులుగా నియమిం చామన్నారు. నారాయణ తిరుమల ఆలయ శాశ్వత చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు మాట్లా డుతూ.. ఆలయానికి సమీపంలో పుష్కరిణి నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఆలయాభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. పాలక మండలి శాశ్వత చైర్మన్‌గా జస్టిస్ యతి రాజులు, సభ్యులుగా మద్ది భాను మతి, కె.శ్రీనివాసరావు, ఎ.గోవింద రావు, శిల్లా రాధిక, జె.అరుణ, కె.నాగరాజు, బి.సాయమ్మలతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, కూటమి నేతలు పా ల్గొన్నారు.