Share News

మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:26 PM

గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పంచాయతీలోని 12వ వార్డు శివనగర్‌కాలనీలో రూ.1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇంటింటా తాగునీటి కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు.

మౌలిక వసతుల కల్పనకు కృషి
ఇంటింటా కుళాయిల ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి :

నరసన్నపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పంచాయతీలోని 12వ వార్డు శివనగర్‌కాలనీలో రూ.1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇంటింటా తాగునీటి కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో వెనుకబడిన ప్రాంతాల్లో శతశాతం రోడ్లు, తాగునీటి సదుపాయం, డ్రైనేజీలు నిర్మించి అభివృద్ధి చేసే దిశగా అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, పొందర, కూరాకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర నర్సింహులు, శిమ్మ చంద్రశేఖర్‌, ఉపసర్పంచ్‌ సాసుపల్లి కృష్ణబాబు, గొద్దు చిట్టిబాబు, జామి వెంకటరావు, ఉణ్న వెంకటేశ్వరరావు, సరియపల్లి మధు, బైరి భాస్కరరావు , బోయన సతీష్‌, కింజరాపు రామారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:26 PM