మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:04 AM
ప్రతి గ్రా మంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం యరగాంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, డ్రెయి న్లను ప్రారంభించారు.
సరుబుజ్జిలి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రా మంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం యరగాంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, డ్రెయి న్లను ప్రారంభించారు. చినకాగితాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన రాజ్యాంగనిర్మాత బీఆర్ అంబేడ్కర్ మాజీ రాష్ట్రనతి డాక్టర్ పీజే అబ్దుల్ కలాం విగ్రహాలను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.పావని, తహసీల్దార్ ఎల్.మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీనాయకులు గురువు తిరుమల రావు, కిల్లి సిద్దార్థ, పల్లి సురేష్, నూక కోటేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు అం బళ్ల రాంబాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు సింహాచలం పాల్గొన్నారు.