Share News

బుడితి కంచు హస్తకళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపునకు కృషి

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:07 AM

బుడితి కంచు హస్తకళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

బుడితి కంచు హస్తకళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపునకు కృషి
కంచు వస్తువులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

సారవకోట (జలుమూరు), డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): బుడితి కంచు హస్తకళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. బుధవారం బుడితి జంక్షన్‌ వద్ద కంచు కళాకారులకు లేపాక్షి ఆధ్వర్యంలో ఇస్తున్న హస్త కళానైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. బుడితి కంచు హస్తకళాకారులు ఇప్పటికే ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బుడితిలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో మార్కెట్‌ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కంచు పాత్రలు అలాగే కంచుతో తయారు చేసిన వివిధ కళాకృతులను కలెక్టర్‌ ఆసక్తిగా తిలకించారు. కార్య్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:07 AM