స్వర్ణాంధ్ర-2047 సాధనకు కృషి చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:13 AM
ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా వికసిత్ భారత్‌లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనకు ప్రతీ ఒక్క అధికారి కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.
నరసన్నపేట, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా వికసిత్ భారత్‌లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనకు ప్రతీ ఒక్క అధికారి కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. సోమవారం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే తహసీల్దార్ కార్యా ల యం నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆశయసాధనకు అధికారులు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ లావణ్య, తహసీ ల్దార్లు ఆర్.సత్యనారాయణ, జె.రామారావు, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
పాతపట్నం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-2047లో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయు డు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎం పీడీవో కార్యాలయం నుంచి ఎమ్మెల్యే పాల్గొ న్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్ ఎన్ వీ శ్రీధర్‌రాజా, తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమా ర్, ఎంపీడీవో పి.చంద్రకుమారి పాల్గొన్నారు.