Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:27 PM

కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషిచేస్తోందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం పోలాకి మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై సమకూర్చిన ఉపకరణాలను మత్స్యకారులకు పంపిణీ చేశారు.

 మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మత్స్యకారులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్న బగ్గు రమణమూర్తి :

పోలాకి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషిచేస్తోందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం పోలాకి మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై సమకూర్చిన ఉపకరణాలను మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో టీడీపీ హాయంలో మత్స్యకారులకు పలు రకాల పరికరాలు రాయితీ ధరపై అందించామని తెలిపారు. వేటకు ఉపకరించే వలలను ఉచితంగా పంపిణీ చేయించేందుకు కృషిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో పి.ధర్మారావు,ఎంపీడీవో రవికుమార్‌,మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు కోడ తాతారావు,కూటమి నాయకులు రోణంకి కృష్ణంనాయుడు, బైరి భాస్కరరావు, ఎంవీ నాయుడు, ఎం.దండాసి, మైలపల్లి త్రినాథ్‌, డోల ప్రసాదరావు, కె.తాతారావు, ధనలక్ష్మి, బలగ ప్రకాష్‌, పి.ధర్మారావు, మత్స్యకార సొసైటీల నాయకలు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:27 PM