రైతుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:42 PM
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష తెలిపారు. రైతులు అభిమానం చూర గొనేలా నూతన పాలకవర్గ సభ్యులు పనిచేయాలని కోరారు.గురువారం వజ్రపుకొ త్తూరు పీఏసీఎస్ అధ్యక్షుడిగా కణితి సురేష్‌చౌదరి, డైరెక్టర్లగా రాపాక శాంతమూ ర్తి, కొత్తూరు అప్పారావుతో ప్రమాణస్వీకారం చేయించి నియామక పత్రాలు అంద జేశారు.
వజ్రపుకొత్తూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష తెలిపారు. రైతులు అభిమానం చూర గొనేలా నూతన పాలకవర్గ సభ్యులు పనిచేయాలని కోరారు.గురువారం వజ్రపుకొ త్తూరు పీఏసీఎస్ అధ్యక్షుడిగా కణితి సురేష్‌చౌదరి, డైరెక్టర్లగా రాపాక శాంతమూ ర్తి, కొత్తూరు అప్పారావుతో ప్రమాణస్వీకారం చేయించి నియామక పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పక్షపాతన్నారు. వైసీపీహయాంలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొ ని 41 వేలఓట్లు మెజార్టీతో గెలిపించి అండగా నిలిచారన్నారు. మాజీ మంత్రి గౌతు శివాజీ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎరువులు. విత్తనాలు అందిండంలో ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. పని చేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.కార్యక్రమంలో టీడీపీ మండతిధ్యక్షుబు సూరాడ మోహనరావు, అగ్నికులక్షత్రియ కార్పోరేషన్ డైరక్టరు పుచ్చ ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, క్లస్టరు ఇన్‌చార్జులు దువ్వాడ హేంబాబుచౌదరి, అర్సవెళ్లి ఉమామహేశ్వరరావు, శశి, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి విఠల్, మాజీ ఎంపీపీ వసంతస్వామి, కణితి అప్పయ్య చౌదరి, రవి, నెయ్యిల సూర్యనారాయణ పాలొల్గన్నారు.
ఫ హరిపురం, జూలై17 (ఆంధ్రజ్యోతి): మందస, బాలిగాం పీఏసీఎస్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు.మందస పీఏసీఎస్ చైౖర్మన్‌గా తమిరి భాస్కరరావు, డైరక్టర్లగా పిన్నింటి వాసు, కడ్రక హరికృష్ణ, బాలిగాం ఛైర్మన్‌గా ఎల్.రుద్రయ్య, డైరక్టర్లగా గున్న రామారావు, సప్ప జీవనరావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాజీ మంత్రి గౌతు శివాజీ, ఎమ్మెల్యే గౌతు శిరీషలను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, కొర్ల కన్నారావు, వజ్జ బాబూరావు, దాసరి తాతారావు, లింగరాజు పాల్గొన్నారు.