Share News

పాడి రైతుల సంక్షేమానికి కృషి: శంకర్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:13 AM

పాడి రైతులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

 పాడి రైతుల సంక్షేమానికి కృషి: శంకర్‌
గార: దూడల ప్రదర్శనలో విజేతకు బహుమతి అందిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

గార, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పాడి రైతులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం తూలుగు సచివా లయం వద్ద పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య గర్భకోశ వ్యాధి నిర్ధారణ శిబిరం, మేలు జాతి దూడ ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాడి రైతులకు రాయితీలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేలు జాతి పాడి ఆవు లను పెంచడం ద్వారా అధిక పాల ఉత్పత్తి చెంది రైతులు ఆర్థికంగా నిలదొక్కు కునేం దుకు అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం దూడల ప్రదర్శనలో విజేతలకు బహుమతులు అందించారు. కార్య క్రమంలో పశుసంవర్ధకశాఖ జేడీ రాజగోపాల్‌, డీడీ గణపతిరావు, ఏడీ డాక్టర్‌ బాలకృష్ణ, సర్పంచ్‌ కొయ్యాన నాగభూషణరావు, మాజీ సర్పంచ్‌ జగదీష్‌, తూలుగు పీఏసీ ఎస్‌ చైర్‌పర్సన్‌ కొయ్యాన శేఖర్‌, పశువైద్యాధికారి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి

అరసవల్లి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): యువత పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకో వాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌ వద్ద విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పుస్తక విక్రయాలు చేప ట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ రవిబాబు, ఇన్‌చార్జి నజీర్‌ఖాన్‌, ఏఐవై ఎఫ్‌ అధ్యక్షుడు కొన్న శ్రీనివాస్‌, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:13 AM