మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:10 AM
మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు పీయూ సీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.సోమవారం మునిసిపాలిటీలోని 17వ వార్డు పూజారిపేట సాయన్నక్వార్టర్స్ పరిధిలో జరుగుతున్న పలుఅభివృద్ధి పనులు పరిశీలించారు.
ఆమదాలవలస, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు పీయూ సీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.సోమవారం మునిసిపాలిటీలోని 17వ వార్డు పూజారిపేట సాయన్నక్వార్టర్స్ పరిధిలో జరుగుతున్న పలుఅభివృద్ధి పనులు పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేయడంతోపాటు ఎటువంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని కోరారు. ఐదేళ్ల వైసీపీపాలనలో పట్టణంలోని పలు వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. దీంతో రహదారులు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరాయని, మురుగునీరు రహదారిపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రవికుమార్ స్కూటీపై పర్యటించారు. కార్య క్రమంలో జనసేన కన్వీనర్ పేడాడ రామ్మోహన్, టీడీపీ నాయకులు కూన ఆంజనే యులు, పీవీకే రాజు పాల్గొన్నారు.