దూసి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:05 AM
DRM Consideration ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌ను శనివారం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్‌బొహరా పరిశీలించారు. జాతిపిత మహాత్మగాంధీ అడుగుపెట్టిన రైల్వేస్టేషన్‌గా ‘దూసి’ గుర్తింపు పొందింది.
డీఆర్‌ఎం పరిశీలన
ఆమదాలవలస, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌ను శనివారం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్‌బొహరా పరిశీలించారు. జాతిపిత మహాత్మగాంధీ అడుగుపెట్టిన రైల్వేస్టేషన్‌గా ‘దూసి’ గుర్తింపు పొందింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటీవల కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకి వినతిపత్రం అందజేశారు. ఆయన సూచన మేరకు డీఆర్‌ఎం శనివారం దూసి రైల్వేస్టేషన్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫ్లాట్‌ఫారం, ప్రయాణికుల విశ్రాంతి భవనం, తాగునీరు, వసతి, లైటింగ్ సదుపాయాలతోపాటు స్టేషన్ ఆవరణలో మహాత్మగాంధీ నాటిన చెట్టును పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి రైల్వే ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.