విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:24 AM
విద్యారంగ సమస్యలను తక్షణం పరిష్కరిం చాల ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పి.పవిత్ర డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలను తక్షణం పరిష్కరిం చాల ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పి.పవిత్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ధర్నాలో పాల్గొని సమస్యలపై నినదించారు. 2018లో ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌కి రూ.15 కోట్లు నిధులు మం జూరు చేస్తామని హామీ ఇచ్చిన్నా నేటికీ కేటా యించలేదన్నారు. రూ.6400 కోట్లు ఫీజు రీఇం బర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని, విద్యార్థులు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం బకాయి లను చెల్లించాలని, జీవో నెంబర్-77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డి.చందు, ఖగేష్, చిన్నా, జయరాం తదితరులు పాల్గొన్నారు.