చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి: శంకర్
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:31 PM
విధులను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు సేవలం దించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం రూరల్/గారరూరల్, సెప్టెంబరు 12(ఆంధ్ర జ్యోతి): విధులను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు సేవలం దించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సింగుపురం, గారల్లోని ప్రైవేట్ కల్యాణ మండపాల్లో అన్ని సచివాలయాల సిబ్బందితో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తు న్న సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటిలో అర్హులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన వారికి అ న్యాయం జరగకుండా బాధ్యత వహించాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారి శుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సచివాల యాలకు వచ్చే ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సేవలందించేలా అందుబా టులో ఉండాలన్నారు. కార్యక్రమం లో ఎంపీడీవోలు శైలజ, రఘు, తహసీలార్లు ఎం.గణపతి, చక్రవర్తి, సింగుపురం సర్పంచ్ ఆదిత్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం
అరసవల్లి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక విశాఖ-ఏ కాలనీలోని కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బా ర్ నిర్వహించి వినతులను స్వీకరించారు. సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే లక్ష్యం: అశోక్
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభి వృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.70 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో పలు వీధుల్లో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం చేపడు తున్నామన్నారు. తద్వారా పట్టణం అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగు తుందన్నారు. పురుషోత్తపురం, కండ్రవీధి, నర్మదేశ్వర ఆలయం వీధి, బాసుదేవుపేట, రత్తకన్న, అచ్చంపేట తదితర కాలనీలు, వీధుల్లో పనులకు వర్షంలోనూ ఆయన పర్యటించి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్, చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, జన సేన ఇంచార్జి దాసరి రాజు, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ యాదవ్, టీడీపీ పట్ట ణ అధ్యక్షుడు పత్రి తవిటయ్య, నేతలు నందిగాం కోటి, రెయ్యి జానకిరావు, కొండా శంకర్‌రెడ్డి, ఎస్.శేఖర్, గిన్ని చిన్నా తదితరులు పాల్గొన్నారు.