అధికార లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:55 PM
తెలంగాణ రాష్ట్రంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ, సీఎం స్పెషల్ సెక్యూరిటీ అధికారి (ఎస్‌ఎస్‌జీ) జల్లు శాంతారావు అంత్యక్రియలు ఆది వారం ఆయన స్వగ్రామం డోల గ్రామంలో అధికార లాంఛనాలతో జరిగాయి.
నివాళులర్పించిన కలెక్టర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి
పోలాకి, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ, సీఎం స్పెషల్ సెక్యూరిటీ అధికారి (ఎస్‌ఎస్‌జీ) జల్లు శాంతారావు అంత్యక్రియలు ఆది వారం ఆయన స్వగ్రామం డోల గ్రామంలో అధికార లాంఛనాలతో జరిగాయి. అభిమానులు, కుటుంబసభ్యుల, ప్రజాప్రతినిధులు, పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి ఆయన పాడి వెంట కదిలి వీడ్కోలు పలికారు. శాంతారావు పెద్ద కుమారుడు బాలగంగాధర్ తిలక్ తండ్రికి తలకొరివిపెట్టారు. వారంరోజుల కిందటే గ్రామానికి వచ్చి సరదాగా మాట్లాడిన శాంతారావు.. ఇలా అకాల మర ణం పొందడాన్ని అతడి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ శాంతారావు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు బైరి భాస్కరరావు ఇంటికి వెళ్లి మృతుడు భార్య జల్లు లక్ష్మి, పెద్దకుమారుడు తిలక్‌ను భార్యను మృతుడు సమీప బంధువు జే.శివను ఓదార్చి అధైర్యపడవ్దని ధైర్యంచెప్పారు. అంత్యక్రియలో పోలాకి ఎస్‌ఐ రంజిత్, సమీప ఏ.ఎస్.పీలు, డీఎప్పీలు, కుటుంబసభ్యులు, అభిమానులు, గ్రామస్ధులు, అధికారులు, సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.