Share News

నేడు డీఎస్సీ నియామక పత్రాలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:59 PM

New teachers going to Amaravati మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు అమరావతిలో గురువారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

నేడు డీఎస్సీ నియామక పత్రాలు
బస్సుల్లో అమరావతికి పయనమవుతున్న కొత్త ఉపాధ్యాయులు

అమరావతికి పయనమైన కొత్త ఉపాధ్యాయులు

గుజరాతీపేట. సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు అమరావతిలో గురువారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి కొత్త ఉపాధ్యాయులు బుధవారం అమరావతికి ఆర్టీసీ బస్సుల్లో పయనమయ్యారు. జిల్లాలో ఎంపికైన ఎస్టీటీ, స్కూల్‌ అసి స్టెంట్‌, వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి 673మంది ఉన్నారు. వీరంతా సహాయకులతో కలిసి మొత్తం 1,568 మంది ఆర్టీసీ బస్సుల్లో పయనమయ్యారు. వీరి కోసం ప్రభుత్వ పురుషుల కళాశాల ఆవరణలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఒక బస్సుకు ముగ్గు రు సహాయకులతోపాటు, పోలీసు భద్రత కూడా అధికారులు కల్పించారు.

Updated Date - Sep 24 , 2025 | 11:59 PM