Share News

మందుబాబుల హల్‌చల్‌

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:35 AM

సుబలయి ఆర్‌ఆర్‌ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు.

మందుబాబుల హల్‌చల్‌

  • పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు

హిరమండలం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సుబలయి ఆర్‌ఆర్‌ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు. రాత్రయితే సరి మందుబాబులకు అడ్డాగా మారిపోతుంది. మద్యం సీసాలతో పాటు పాన్‌పరాగ్‌, గుట్కా తదిదర మత్తు పదార్థాలు సేవించి అక్కడే విడిచిపెడుతున్నారు. దీంతో ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందిపడు తున్నారు. ఇటీవల గాంధీ విగ్రహం, పాఠశాల బోర్డు ధ్వంసం చేశారు. ఇప్పుడు బుధవారం రాత్రి కూడా పాఠశాల తరగతి గదులు బయట మద్యం ఖాళీ సీసాలు, ఖైనీ ప్యాకెట్లు ఉండడంతో హెచ్‌ఎం సాహూ పోలీసులకు ఫిర్యాద చేశారు. దీంతో కొత్తూరు సీఐ సీహెచ్‌ ప్రసాదరావు గురువారం పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ఆకతాయిలపై నిఘా పెట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

Updated Date - Sep 05 , 2025 | 12:35 AM